Hydra effect : హైడ్రా ఎఫెక్ట్.. ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం

Hydra effect

Hydra effect

Hydra effect : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. హైడ్రా ఇష్యూనే రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు. గత నెలలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య 26 శాతానికి పైగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గత ఆరు నెలల్లో గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరగాల్సి ఉండగా రూ.300 కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.  కానీ గత ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం చూస్తే ఆశించిన స్థాయిలో రాలేదని స్పష్టమవుతోంది. స్థిరాస్తి విక్రయాలతో పాటు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 6 నెలల్లో 43,000 వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, 40,000 పైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యవసాయ భూముల విక్రయాలు రూ. 121.49 కోట్లు, వ్యవసాయేతర భూములు, భవనాల అమ్మకాలు తగ్గగా, ఆదాయం రూ. 154 కోట్లు. ఇక్కడ వ్యవసాయ, వ్యవసాయేతర విక్రయాలను తీసుకుంటే గతేడాది ఆరు నెలలతో పోలిస్తే 80 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు తగ్గినా రూ.32 కోట్ల ఆదాయం పెరిగింది.

జనవరి నుంచి సెప్టెంబరు వరకు నెలవారీగా జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే ఏప్రిల్‌లో 1.22 లక్షల డాక్యుమెంట్లు నమోదయ్యాయి. తద్వారా రూ. 1,045 కోట్లు, మేలో 1.46 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. తద్వారా రూ. 965 కోట్లు, జూన్‌లో 1.67 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి.  తద్వారా రూ. 1,129.53 కోట్లు, జూలైలో 2.04 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయగా, రూ.1,531.32 కోట్ల ఆదాయం వచ్చింది.  ఆగస్ట్ 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని విస్తృత ప్రచారం జరగడంతో పెద్దఎత్తున డాక్యుమెంట్లు నమోదయ్యాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆగస్టులో 1.49 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా రూ. .1,071.29 కోట్లు. ఇక సెప్టెంబర్ నెలలో 1.30 లక్షల డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా, ఆదాయం రూ.770.36 కోట్లు మాత్రమే. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం మూడు వందల కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయింది.

TAGS