Hydra : హైడ్రా.. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొందరి గుండెల్లో గుబులు రేపుతున్న పేరు. చెరువులు, కాలువల పరిరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన హైడ్రా మిషన్ చురుగ్గా పనిచేస్తోంది. హైడ్రా చర్యలపై చాలా చోట్ల విమర్శలు వచ్చినా ఈ బుల్డోజర్ తన పని తాను చేసుకుపోతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తోంది. హైడ్రా సంస్థకు చట్టబద్ధత లేదని కొందరు రాజకీయ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. హైడ్రాకు అన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పిస్తూ నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.
ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు… హైడ్రా బుల్డోజర్లు పరుగు పరుగున వచ్చేస్తున్నాయి. ఎక్కడో ఒక చోట కూల్చివేతలు షురూ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా హైడ్రా తన జోరు తగ్గించింది. అయితే, తెలంగాణ మంత్రివర్గంతో పాటు సుప్రీంకోర్టు తాజా తీర్పుల నేపథ్యంలో ఈ వారం హైడ్రా పెద్ద కూల్చివేతలే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చెరువు శిఖం భూముల్లో ఉన్న ఓ బడా కంపెనీకి చెందిన హైరైజ్ అపార్ట్ మెంట్ లోని రెండు భారీ భవనాలను కూల్చబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం హైడ్రా పెద్ద మెషనరీని వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరిపినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇటీవల బుల్డోజర్ ను ఆపాలంటూ పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ… చెరువుల ఆక్రమణల్లో మాత్రం ప్రభుత్వాల ఇష్టం, తమ తీర్పు వర్తించందు అంటూ కామెంట్ చేసింది. తీర్పు వచ్చిన కాసేపటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. దీన్ని బట్టి హైడ్రా ఏం చేయబోతుందో, చెప్పకనే చెప్పినట్లు అయింది. పైగా హైడ్రాకు మరిన్ని ఆధారాలు కట్టబెడుతూ తెలంగాణ కేబినెట్ ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. సీఎం పదే పదే హైడ్రా ఆగదు అంటూ ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో, హైడ్రా మరోసారి కూల్చివేతలకు దిగబోతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.