Chandrababu Victory : చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ కు విడదీయలేదని బంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందే కానీ ఆయన ఎప్పటికీ హైదరాబాద్ పై ప్రేమను చూపిస్తూనే ఉంటారు. హైదరాబాద్ ను పెద్ద కొడుకుగా భావిస్తారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్ర హాయాంలో హైదరాబాద్ ను ప్రపంచానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడే అంటే అతిశయోక్తి లేదు. హైదరాబాద్ నేడు సౌత్ కు అతిపెద్ద సిటీగా గుర్తింపు దక్కిందంటే కూడా చంద్రబాబే కారణం.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐటీ బూమ్ ను పరుగులు పెట్టించాడు. రింగ్ రోడ్ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడిదేనని కానీ వైఎస్ దాన్ని కంప్లీట్ చేశాడని అంటుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ బాబును అభిమానించే వారు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్, కాలనీల్లో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఏపీలోనే కాదు హైదరాబాద్ లో కూడా వేడుకలు చేసుకుంటున్నారు. ఫలితాల రోజున నగర వ్యాప్తంగా పటాకలు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్నారు. మహిళా నాయకులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. కానీ ఇళ్లలో ఉన్న టీడీపీ ఫాలోవర్స్ మహిళలు కిట్టీ పార్టీలతో సంబురాలు చేసుకున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో ట్రెండ్ గా నడుస్తోంది.