Hyderabad:న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు..వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
ఈ మేరకు న్యూ ఇయర్ మర్గదర్శకాలను జారీ చేశారు. హైదరాబాద్ సీపీ కొత్త కోట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ `న్యూ ఇయర్ సందర్భంగా నిర్వాహకులు పది రోజులు ముందుగానే పోలీసులు పర్మీషన్ తీసుకోవాలి. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలి. ప్రతి ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పని సరి. ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిదే. పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతిలేదు.
అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదు.
ఈవెంట్‌లో కెపాసిటీకి మించి పాస్‌లు ఇవ్వకూడదు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దు. లిక్కర్ సంబంధిత ఈవెంట్‌లలో మైనర్‌లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయకూడదు.