Bus Accident : హైదరాబాద్ యాత్రికుల బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

Bus Accident
Bus Accident : హైదరాబాద్ నుంచి యాత్రికులతో ఒడిశా వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతిచెందగా, ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
యాత్రికులందరూ హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. తీర్థయాత్రల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 30 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం.