Fastest growing cities : గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ అయిన సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. గ్రోత్ హబ్స్ ఇండెక్స్ 2033 నాటికి జీడీపీ పెరుగుదల, వ్యక్తిగత సంపద, జనాభా పోకడలు, వలసల నమూనాలు వంటి కీలక అంశాలను విశ్లేషించి ఆయా నగరాలకు ర్యాంక్ ఇచ్చింది. భారతదేశం వేగవంతమైన పట్టణీకరణతో ఇతర ప్రధాన భారతీయ నగరాలతో పాటు హైదరాబాద్ కూడా టాప్ 5 స్థానం దక్కించుకుంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 5 నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. వియత్నాంలోని హోచిమిన్ సిటీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. చైనాలోని షెన్‌జెన్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే ఈ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 లో చూస్తే వియత్నాంలోని హనోయి ఆరో స్థానంలో ఉంది. చైనాలోని గ్వాంగ్‌జౌ ఏడో స్థానంలో ఉంది. ముంబై ఎనిమిదో స్థానంలో ఉంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలా తొమ్మిదో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ పదో స్థానం.