Cadbury Dairy Milk : హైదరాబాదీ దెబ్బకు క్యాడ్ బరీ అబ్బా..‘డైరీమిల్క్ లో పురుగు’ ఘటనపై దిగొచ్చిన కంపెనీ

Hyderabad hit Cadbury ..

Hyderabad hit Cadbury company..

Cadbury Dairy Milk : డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్లు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఏ వయస్సు వారికైనా చాక్లెట్లలో ఫస్ట్ చాయిస్ డైరీమిల్కే.  పుట్టినరోజు వేడుకల్లో డైరీమిల్క్ లేనిదే ఆ వేడుక పూర్తికాదు. లవర్ కు సర్ ప్రైజ్ గా ఇవ్వడంలో కూడా డైరీమిల్క్ దే మొదటి స్థానం. అలాగే ప్రేమికులు ముచ్చటించుకుంటున్న వేళ వారి మధ్యన ఉండేది డైరీమిల్కే. ఇలా డైరీమిల్క్ ప్రతీ ఒక్కరికి ఇష్టమైన చాక్లెట్ గా ఫుల్ ఫేమస్. అయితే మనం ఎంతో ఇష్టంగా కొంచెం కొంచెం కొరుక్కుని తింటూ ఆస్వాదించే డైరీమిల్క్ ను ఇక జాగ్రత్తగా చూసి తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటనే దానికి కారణం.

నగరానికి చెందిన రాబిన్ జాకీస్ అనే వ్యక్తి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోని ఓ షాపులో క్యాడ్ బరీ డైరీమిల్క్ చాక్లెట్ కొన్నాడు. తినేందుకు దానిని ఓపెన్ చేసినప్పుడు అందులో ఓ పురుగు కదులుతూ కనిపించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాబిన్ ఓ వీడియోను ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

‘అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోని రత్నదీప్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన క్యాడ్ బరీ చాక్లెట్ లో ఒక పురుగు పాకుతున్నట్లుగా గుర్తించా.. గడువు ముగియనున్న ఉత్పత్తుల విషయంలో నాణ్యత తనిఖీలు ఉండవా? ప్రజారోగ్యానికి బాధ్యత ఎవరిది? అంటూ తన పోస్ట్ లో రాబిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ పై పలువురు సోషల్ మీడియన్లు ఆ కంపెనీపై కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో క్యాడ్ బరీ డైరీమిల్క్ సంస్థ స్పందించింది. ‘హాయ్..మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో క్యాడ్ బరీ ఇండియా లిమిటెడ్) అత్యధిక నాణ్యాతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. మీకు కలిగిన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ సమస్యను పరిష్కరించడానికి దయచేసి మీ పూర్తిపేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు కొనుగోలు వివరాలను Suggetions@mdlzindia.com కు పంపించమని అభ్యర్థిస్తున్నాం. మీ ఫిర్యాదుపై తగిన చర్య తీసుకుంటాం ధన్యవాదాలు అని సమాధానం ఇచ్చింది.

TAGS