Bigg Boss : భార్యను బిగ్ బాస్ కు పంపి.. మరో అమ్మాయితో దుబాయ్‌కి చెక్కేసిన యాక్టర్ హస్బెండ్..

Bigg Boss

Bigg Boss Contestant Arya

Bigg Boss Show : బిగ్‌ బాస్ షో మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ షో మన సంస్కృతికి విరుద్ధం, దీన్ని నిలిపివేయాలని సంప్రదాయ వాదులు వాదిస్తున్నా పట్టించుకోని నిర్వాహకులు యధావిధిగా నడిపిస్తూ వివాదాలకు కారణం అవుతున్నారు. హిందీ నుంచి దీన్ని వివిధ భాషలు దత్తత తీసుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షో మొదట్లో ఉత్తరాదిన బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత దక్షిణాదికి పాకింది. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తుంది. వీటన్నింటిలోకెల్లా తెలుగులో ఎక్కువ పాలపులర్ అయ్యింది.

ఈ షో ద్వారా కంటెస్టెంట్ ఎమోషన్, హ్యాపీనెస్ లాంటి పర్సనల్ విషయాలను కూడా బయటపెడుతూ వివాదాలకు కారణం అవుతున్నారు. కానీ, ఈ షోలో కంటెస్టెంట్లు  బయట బాగా పాపులర్ అవుతున్నారు. ఈ షో ద్వారా లవ్ ట్రాక్ నడిపించిన వారు కొందరైతే విడిపోయిన జంటలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ షో కారణంగా ఒక జంట విడాకులు తీసుకున్నారన్న వార్త బయటకు వచ్చింది. బిగ్‌బాస్ షోకు వెళ్లి కాపురం కూల్చుకున్నా అంటూ ఒక నటి ఆవేదనతో చెప్పింది. ఆ విషయం చూద్దాం..

మళయాలం బుల్లితెరపై గుర్తింపు పొందిన నటి ‘ఆర్య’ కొన్ని సీరియల్స్‌లో నటించి ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈ భామ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. అయితే, ఈ బిగ్‌బాస్ షో వలనే తన జీవితం నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త షోకు వెళ్లాలని తనపై ఒత్తిడి చేశాడట. ఫేం కోసం ఆయన నాపై ఒత్తిడి తెస్తున్నారని అనుకున్నా.. కాని అసలు విషయం తర్వాత బయటపడిందని చెప్పింది. నేను షోకు వెళ్లి వచ్చే సరికి నా భర్త అడ్రస్ లేడని చెప్పుకచ్చింది. ఆయన కోసం వెతికినా ఫలితం కనిపించలేదు. ఒక రోజు నా సోదరి ఫోన్ చేసి నా భర్త గురించి షాకింగ్ విషయం చెప్పింది. నేను షోకు వెళ్లగానే ఆయన మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని దుబాయ్‌కి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. కొవిడ్ కారణంగా తాను అక్కడకి వెళ్లలేకపోయా.. అలా నేను నా భర్తకు దూరం అయ్యాను.. అంటూ కన్నీరు పెట్టుకుంది.

TAGS