Suicide : భార్య లైంగిక వేధింపులతో భర్త ఆత్మహత్యాయత్నం

Suicide

Suicide

Suicide : భార్య లైంగిక వేధింపులను తట్టకోలేని ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ సూర్యనారాయణపురంలో ఓ వ్యక్తి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ
ఆత్మహత్యకు యత్నించాడు. జరిగిన విషయాలను వివరిస్తూ మూడు పేజీల లేఖ కూడా రాశాడు. ఆ లేఖలో తాను ఎంత మానసిక క్షోభ పడుతున్నదీ, తన భార్య, ఆమె అమ్మానాన్న, సోదరుడు తనను ఎలా వేధిస్తున్నదీ పేర్కొన్నాడు. భార్య పెట్టే వేధింపులు తీవ్రమయ్యాయని లేఖలో వాపోయాడు.

వేధింపులు భరించలేక గట్టిగా అడిగితే కేసు పెట్టారని, తన భార్త ప్రవర్తన అసలు బాగోలేదని, పెళ్లయిన కొత్తలో వాళ్ల బావతో చాటింగులు చేసిందని, ఆ తర్వాత ఆషాఢమాసం లో అమ్మగారింటికి వెళ్లి పొరుగువారితో కూడా చాటింగులు చేసిందని ఆరోపించాడు. ఇక రాత్రిళ్లు లైంగికంగా చాలా హింసించేదని, చివరకు తన మేనల్లుడిని కూడా వేధింపులకు గురి చేసిందంటూ బాధితులు లేఖలో వాపోయాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

TAGS