Bollywood Star Hero : వందల కోట్ల బాలీవుడ్ స్టార్ హీరో తల వెల రూ.25 లక్షలు.. పోలీసుల విచారణలో షాకింగ్ న్యూస్
Bollywood star hero : అతను బాలీవుడ్ టాప్ స్టార్ హీరోల్లో ఒకడు. వరుస హిట్లతో వందల కోట్లు వసూలు చేస్తున్నాడు. ఆ హీరో సినిమా విడుదలైందంటే వందల కోట్ల బిజినెస్ చేస్తుంది. ఆ హీరో రెమ్యూనరేషన్ దాదాపు 200 కోట్లకు పైనే. ఇంత మార్కెట్ ఉన్న హీరోను మర్డర్ చేస్తే రూ. 25 లక్షలు ఇస్తానని జైలులో ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ తన అనుచురులకు ఆఫర్ ఇచ్చాడు. అనుచరులు కూడా రంగంలోకి దిగారు. కానీ మర్డర్ వర్కౌట్ కాలేదు. కానీ మర్డర్ మాత్రం చేసి తీరుతామంటున్నాడు సదరు గ్యాంగ్ స్టర్. ఇదంతా సినిమా స్టోరీ కాదు. ముంబై పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.
ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచారు. లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను ఇప్పటికే చాలాసార్లు బెదిరించింది. ఇటీవల సల్మాన్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి కాల్పులు కూడా జరిపిన విషయం తెలిసిందే. దీంతో ముంబై ఉలిక్కి పడింది. పోలీసుల విచారణకు ముందే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తామే కాల్పులు జరిపామంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్లూభాయ్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఈ కండల వీరుడిని కలవడానికి అభిమానులు రావొద్దంటూ సల్మాన్ కుటుంబం కూడా అభ్యర్థించింది. మరోవైపు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లోని షూటర్ సుఖ్ అలియాస్ సుఖ్‌బీర్ బల్బీర్ సింగ్‌ను ముంబై పోలీసులు హర్యానాలోని పానిపట్‌లో అరెస్టు చేశారు. దీంతో సల్మాన్‌ఖాన్‌పై దాడికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నట్లు సుఖా పోలీసులకు తెలిపాడు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ తన గ్యాంగ్ సభ్యులకు రూ. 25 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీంతో సుఖా పాకిస్తాన్ కు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ ను అత్యాధునిక ఆయుధాలు తెప్పించుకున్నాడు. దీనికి ముందుగానే 50 శాతం పేమెంట్ కూడా చేశాడు. 70 మందితో నిఘా ఏర్పాటు చేసుకున్నారు. సల్మాన్ ప్రతి కదలికను ఈ ముఠా ఎప్పటికప్పుడు టీమ్ లీడర్ కు చేరవేస్తుంటుంది.
ఐదుగురు నిందితుల అరెస్టు
ఏప్రిల్ 24న సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని 18 మంది సభ్యులపై నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ , రోహిత్ గోధరా పేర్లు ఉన్నాయి. వీరిని నిందితుల జాబితాలో పేర్కొన్నారు. నవీ ముంబై పోలీసులు తమ విచారణలో లారెన్స్ బిష్ణోయ్ బిష్ణోయ్ ముఠాలోని ఐదుగురు సభ్యులైన ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్, దీపక్ హవా సింగ్ అలియాస్ జాన్‌లను అరెస్టు చేశారు.