Human trafficking : మానవ అక్రమ రవాణా.. ఆరుగురికి జీవిత ఖైదు

Human trafficking
Human trafficking : మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురు నిందితులకు హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉద్యోగాల పేరిట బంగ్లాదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు నిర్ధారించింది. 2019లో పాతబస్తీలోని చత్రినాక ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా.. ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితులు యూసఫ్ ఖాన్, అతడి భార్య బీతి బేగం, సోజిబ్, రాహుల్, అబ్దుల్ సలాం, షీలాలకు జీవిత ఖైదు విధించింది.