CM Revanth Reddy : నదులు కనుమరుగైతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : నదులను కనుమరుగయ్యేలా చేస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం, పటిష్ఠ ఆర్థిక పర్యావరణ కోణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసీ నది ఒక వరం కావాలి. కానీ శాపంగా మిగిలిపోకూడదని సీఎం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే, ప్రజా ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఇది ఈ తరానికే కాదు, భావితరాలకు మేలు చేసే నిర్ణయమని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల ‘మూసీ పునరుజ్జీవం-ప్రక్షాళన’ పేరుతో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురి నుంచి సీఎం నిర్ణయం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు.

TAGS