JAISW News Telugu

tomato : భారీగా పెరిగిన టమాటా ధర.. హైదరాబాద్ లో కిలో రూ.100

FacebookXLinkedinWhatsapp

tomato Price : దసరా నవరాత్రి ఉత్సవాల వేళ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. పండుగ సమయంలో మార్కెట్లలో పూల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కూరగాయల్లో టమాటా ధర కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటా ధర రూ.100గా ఉంది. మొన్నటి వరకు కిలో రూ.10 నుంచి రూ.20లుగా ఉన్న టమాటా ధర అమాంతం పెరిగింది.

ప్రస్తుతం రైతు బజార్లు, హోల్ సేల్ షాపుల్లో కిలో రూ.60 నుంచి 80 వరకు ధర పలుకుతోంది. రిటైల్ మార్కెట్ లో మాత్రం రూ.100కు చేరుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరఫరాలో కొరత ఏర్పడిందని కూరగాయల విక్రయదారులు చెప్తున్నారు. సాధారణంగా, ధరలు ఈ సీజన్ లో తగ్గుగాయి.. వేసవిలో మళ్లీ పెరుగుతాయి. కానీ, అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూరగాయలపై పడుతోందని పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version