Srisailam Mallanna : శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం

Srisailam Mallanna : శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.4,14,15,623 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నగదుతో పాటు 322 గ్రాముల బంగారం, 8.520 కిలోల వెండి, పలు విదేశీ కరెన్సీ వచ్చినట్లు వెల్లడించారు.  ఈ మొత్తం ఆదాయం 26 రోజుల్లో సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ అధికారులు సిబ్బందితో పాటు శివసేవకులు హుండీలల్లో కానుకలను లెక్కించారు.

చంద్రావతి కల్యాణ మండపంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. పటిష్టమైన భద్రతా, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. గత 26 రోజుల్లో హుండీల లెక్కింపు ద్వారా రూ.4,14,15,623 ఆదాయం నగదు రూపంలో వచ్చింది. నగదుతో పాటుగా 32.230 తులాల బంగారు, 8.5 కిలోల వెండి వచ్చాయి. అలాగే 739 యూఎస్ఏ డాలర్లు, 1020 మెక్సికో పిసో, 1000 ఉగాండా షిల్లింగ్స్, 205 సింగపూర్ డాలర్లు, 200 ఘనా సీడిస్, 135 ఆస్ట్రేలియా డాలర్లు, 100 కెనడా డాలర్లు, 50 యూఏఈ దిర్హమ్స్ ఆదాయంగా వచ్చింది.

TAGS