Huge flood : ఎగువనున్న రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆయా ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోగా, గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతున్నది.
భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి 2.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 7.627 లక్షల క్యూసెక్కుల నీరు ఉంది.