Fire accident : జనగామలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన వస్త్ర దుకాణాలు
fire accident in Janagama : జనగామ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుది. పట్టణంలోని రెండు పెద్ద వస్త్ర దుకాణాలు అగ్నిప్రమాదంలో కాలి బూడిదవడంత చేలరేగిన మంటలతో పట్టణం అంతా దట్టమైన పొగ అవరించింది. ఉదయం 6 గంటలకు తొలుత విజయ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు రెండు గంటల్లోనే పక్కనే ఉన్న శ్రీలక్ష్మి, ఎస్ఆర్ బ్రదర్స్ వస్త్ర దుకాణాలకు వ్యాపించడంతో మూడు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.10 కోట్ల విలువైన వస్త్రాలు కాలిబూడిదయ్యాయి.
ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆదవారం అర్ధరాత్రి సమయంలో విజయ వస్త్ర దుకాణంలో ఏసీ కంప్రెసర్ పేలిన శబ్ధం వచ్చినట్లు స్థానికులు తెలిపారని విద్యుత్తు శాఖ ఎస్ఈ తెలిపారు. రెండు వస్త్రాల దుకాణాల భవనాలు పగుళ్లు పట్టి ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉన్నాయి. రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లడంతో మనోవేదనకు గురైన వస్త్ర దుకాణాల యజమానులు భోగ భాస్కర్, కైలాసం ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది కాలిపోతున్న దుకాణాలను చూసి కంటతడిపెట్టారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో సీఐ దామోదర్ రెడ్డితో పాటు నర్మెట్ట సీఐ అబ్బయ్య, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఎస్సైలు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.