China:చైనాలో భారీ భూకంపం, 116 మంది దుర్మరణం

China:చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా.. సుమారు 116 మందికిపైగా మృతి చెందారు. 400 మందికిపైగానే గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్సు, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్‌ మీడియా తెలిపింది. అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

TAGS