Huge drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేయగా, పక్కా సమాచారంతో చందానగర్ పోలీసులు దాడులు చేశారు. రూ.18 లక్షలు విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఈ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్ పెడ్లర్ కృష్ణరామ్ ను పోలీసులకు ఓ డాక్టర్ పట్టించారు. కృష్ణ రామ్ ఆహ్వానించడంతో పార్టీకి వెళ్లిన వైద్యుడు, కృష్ణరామ్ బ్యాగ్ లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణరామ్ ను అరెస్టు చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.