Hyderabad : హైదరాబాద్ బోయిన్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

 Hyderabad

Hyderabad drugs

Hyderabad : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడం కలకలం రేపింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 8.5 కేజీల ఎఫిటమిన్ డ్రగ్స్ ను నార్కోటిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి జిన్నారం నుంచి ఎఫిటమైన డ్రగ్స్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాటిని బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద డెలివరీ చేసేందుకు కారులో వెళ్తున్నట్లు హెచ్ న్యూ (హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్)  పోలీసులు గుర్తించారు. బోయిన్ పల్లి పోలీసుల సాయంతో డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద నిందితుల వాహనాన్ని అడ్డగించారు. కారు డ్రైవర్ వినోద్, నాగరాజ్, శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కారు డిక్కీలో ఉన్న ఎఫిటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

TAGS