Operation Valentine : మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ప్రిన్స్ గా గుర్తింపు సంపాదించుకుని తన స్టయిల్ సూటయ్యే కథలను ఎంచుకొని దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్. ఇలా వైవిధ్యమైన సినిమాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ రెండు సినిమాలతో ఎదురుదెబ్బలు తిన్నాడు.
దీంతో ఈ సారి సక్సెస్ సాధించాలని గట్టి పట్టుదలతో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేశాడు. ఈ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది? ఎన్ని కోట్లు వస్తే హిట్‌గా నిలుస్తుంది? అనే వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్‌ఫోర్స్ కథతో..
వరుణ్ తేజ్ నటించిన ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్రౌండ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. వరుణ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంగీతం మిక్కీ జే మేయర్ సమకూరుస్తున్నారు.
ఫుల్ యాక్షన్..
‘ఆపరేషన్ వాలెంటైన్’ దేశభక్తితో కూడిన యాక్షన్ మూవీ. టెర్రరిస్ట్ దాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంతో తెరకెక్కించారు. ఇందులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ కనిపిస్తారు.
మార్చి 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ మూవీ విషయంలో సందడి కనిపిస్తోంది. మూవీ కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. కానీ, బుకింగ్స్ విషయంలో ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.
మంచి డిమాండ్..
ఈ మూవీపై వరుణ్ తేజ్ తో పాటు క్రూకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఏ అప్ డేట్ వచ్చినా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉంది. ఫలితంగా వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకు అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఏపీ, తెలంగాణలో బిజినెస్
ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఏరియాలను కలిపి రూ. 7.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా
‘ఆపరేషన్ వాలెంటైన్’కు ఆరంభం నుంచే మంచి హైప్ దక్కించుకుంది. దీంతో కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 3.00 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 17 కోట్లు వ్యాపారం జరిగింది. ఇది హిట్ అవ్వాలంటే రూ. 18 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.