Lokayukta : అమరావతిలోనే హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్: ఏపీ ప్రభుత్వం

Lokayukta : హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను అమరావతి నుంచి తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను అమరావతిలోనే ఉంచుతామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సంస్థలను అమరావతిలోనే కొనసాగించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తామని పేర్కొంది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ అనే మహిళ, ఏపీ సివిల్ లిబర్టీస్ అస్సియేషన్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనల వినిపించారు. అనంతరం, తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది.
TAGS