Meteor Shower:ఆకాశంలో అద్భుతం జరుగుతోంది, జెమినిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తోంది. ఆకాశం నుంచి భూమికి రాలే తోక చుక్కలను చూడడానికి ప్రజలంతా తెగ ఆసక్తి చూపుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ వరకు ఈ తోక్ చుక్కలను చూడవచ్చు. ఈ నెల 20 వరకు ఇవి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. పాధియానే అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో కాంతివంతమైన ఉత్కాపాతాలు కనిపించనున్నాయి. సాధారణంగా పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది.
ఇది కొద్ది నెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది, ఈ క్రమంలో కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉత్కలుగా రాలిపడుతుంది. ఇది గరిష్టంగా 150 వరకు ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని అంతర్జాతీయ ఉత్కాపాత సంస్థ తెలిపింది. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చని సూచించింది.
జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని ఎలా చూడాలి?
ఈ జెమినిడ్స్ ఉల్కాపాతాన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. రాత్రి పూట కాంతి ఉన్న ప్రదేశంలో కాకుండా చీకటిగా ఉన్న ప్రాంతంలో నిలబడండి, లేదా పడుకోండి, ఆకాశం చక్కగా కనిపించే ప్రకాశవంతమైన ప్రాంతాన్ని ఎంచుకోండి. 15 నుంచి 20 నిమిషాలపాటు చీకటికి సర్దుబాటు చేసుకోండి. కాస్త ఓపికగా చూడండి. అప్పుడు కనిపిస్తుంది. ఫోన్‌లో కూడా దీనిని రికార్డు చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఇంటరాక్టీవ్ స్కై మ్యాప్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. అక్కడ ఉత్కాపాతం ఏర్పడుతుంది. ఒకవేళ ఇంకా చూడకుంటే ఈ రోజు రాత్రి చూసేయండి.