Bath Right Way : మనం రోజు స్నానం చేస్తుంటాం. ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేయడం మంచిది. ఉదయం నాలుగు గంటలకు చేసే స్నానం రుషి స్నానం. ఐదు గంటలకు చేసే స్నానం గంధర్వ స్నానం, ఆరు గంటలకు చేసే స్నానం దైవ స్నానం అని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఉత్తమం. స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో మంచి ఫలితాలు వస్తాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉదయం స్నానం చేయాలి. సూర్యుడు ఉదయించకముందే స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహస్తుందని నమ్ముతారు. ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం ఆలస్యంగా స్నానం చేయడం సరైనదే. అనారోగ్యం ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. స్నానం చేయడం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
మగవారు రోజు తల స్నానం చేయాలి. స్త్రీలు మాత్రం వారానికి ఒకసారి తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నడుముకు కట్టుకున్న టవల్ తీసేయాలి. స్నానం చేసేటప్పుడు టవల్ కిందకు జారితే దారిద్ర్యానికి సంకేతం. వారానికి ఒకసారైనా ఉప్పు కలిపిన నీళ్లతో తలస్నానం చేస్తే ఐశ్వర్యం, పాజిటివ్ ఎనర్జీ కలుగుతాయి. స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు.
గులాబీ రేకులతో తల స్నానం చేయడం వల్ల చర్మ సౌందర్యం కలుగుతుంది. మానసిక స్థితి బాగుంటుంది. నిలబడి తలస్నానం చేయకూడదు. కూర్చుని స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిలబడి స్నానం చేయాలి. కూర్చుండి స్నానం చేస్తే మంచిది. ఈ విషయాలు తెలుసుకుని స్నానం చేస్తే దరిద్ర్యం దూరమవుతుంది.