Toilet : ఈ రోజల్లో యువత చాలా విషయాల్లో వెనకబడి ఉంటుంది. టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా రోజు వారీ కార్యక్రమాల్లో ఏది మంచో ఏది చెడో గుర్తించలేకపోతున్నారు. కొన్నింటి గురించి అసలు తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కానీ, యువతకు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో కూడా తెలియడం లేదంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.
మామూలుగా వెస్ట్రర్న్ టాయిలెట్ వాడకం ఈ రోజుల్లో ఎక్కువైంది. వాటిపై ఇప్పటికీ చాలా మందికి కనీసం అవగాహన లేదు. దీనికి కారణంగా స్మార్ట్ ఫోన్లేనని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ల మాయలో పడి ఇలా తయారవుతున్నారని అంటున్నారు. అంతే కాకుండా వీరికి సమాజం, వస్తువులపై కూడా అవగాహన ఉండడం లేదు.
టాయిలెట్ సీట్ మీద కూర్చుని యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ వాడటం, వీడియోలు చూడటంతోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో ఎలా కూర్చున్నామో మర్చిపోయి దీంతో ఎక్కువ సేపు బాత్రూంలోనే గడిపేస్తారు. నిజానికి బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడమే తప్పు. ఫోన్ పట్టుకుని టాయిలెట్ సీట్ మీద కూర్చోవడం వల్ల పైల్స్ లేదా హోమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మల విసర్జణ వెళ్లే ప్రాంతం చుట్టూ వాపు రావడం, నరాలు ఉబ్బడం జరుగుతుందట. దీంతో నొప్పి, అసౌకర్యం, మలంలో రక్త రావడం మొదలవుతుందట.
క్రమంగా మలబద్దకం సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ కూడా రావొచ్చంటున్నారు నిపుణులు. బాత్రూంలో గంటకొద్దీ ఉండటం మానుకోవాలి. అరగంట, 45 నిమిషాల సమయం గడపడం చాలా మందికి అలవాటుగా మారింది. ఇది మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. టాయిలెట్ లో 7 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదు. గరిష్టంగా 10 నిమిషాలు మించొద్దు.