JAISW News Telugu

Babar Azam : 11 మంది ప్లేయర్ల ఆట నేనే ఎలా ఆడాలి.. ఆ మ్యాచ్ ల్లో బ్యాటింగ్ విఫలంతోనే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం

Babar Azam

Babar Azam

Babar Azam : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి టీంలు ఇప్పటికే గ్రూప్ స్టేజీలోనే ఎలిమినేట్ అయి ఇంటి బాట పట్టాయి. అయితే పాకిస్థాన్ టీం పై మాజీ క్రికెటర్లు, ప్లేయర్లు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోగా.. చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిచి పరువు నిలుపుకుంది. దీనిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందిస్తూ పాకిస్థాన్ బౌలింగ్ విభాగం బాగానే ఉంది. కానీ బ్యాటింగ్ లోనే తడబాటు ఎదురైంది.

బ్యాటింగ్ లో సరైన విధంగా ఆడకపోవడంతోనే యూఎస్ఏ, ఇండియాపై ఓడిపోవాల్సి వచ్చింది. అయినా క్రికెట్ అంటే టీం గేమ్. 11 మంది బాగా ఆడితేనే గెలుస్తాం. నేనొక్కడినే 11 మంది ఆటను ఆడలేం కదా.. అందుకే ఓడిపోవాల్సి వచ్చింది. టీం లో ఉన్న 11 మంది ప్లేయర్లు రాణిస్తేనే ఏదైనా మ్యాచ్ గెలవగలం.. మేం సమిష్టిగా ఆడలేకపోయాం. అందువల్లే యూఎస్ఏ, ఇండియాలపై ఓడిపోయాం. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఐర్లాండ్ తో మ్యాచ్ లో పాక్ గెలిచింది.

ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 106 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (32) చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును గెలిపించాడు. అయితే కెప్టెన్సీ వదిలిపెడతారా అన్న వ్యాఖ్యలకు నేనేందుకు కెప్టెన్సీ వదిలిపెట్టాలి. ఒక పీసీబీ  ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.

అయితే పాకిస్థాన్ టీంకు సంబంధించి సెలక్షన్ పై ఎక్కువ విమర్శలు వచ్చాయి. మొయిన్ ఖాన్ కొడుకు ఆజం ఖాన్ ఆడిన మొదటి మ్యాచ్ లో అమెరికాపై మొదటి బంతికే డకౌట్ అయి వెనుదిరగ్గా.. తీవ్ర విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ ప్లేయర్లలో దాదాపు 8 మందిని తీసేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version