Team India Strong : ప్రత్యర్థులే భయపడేలా ఈ టీమిండియా ఎలా తయారయింది
Team India Strong in ODI World Cup 2023 : వరల్డ్ కప్ 2023లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరాయి. ఇవే జట్లు 2003లో కూడా ఫైనల్ లో తలపడ్డాయి. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడాలున్నాయి. అప్పుడు భారత్ జట్టు పేలవంగా ఉండేది. ఆస్ట్రేలియా పవర్ ఫుల్ జట్టుగా నిలిచింది. నాకౌట్ దశలు దాటుకుని ఫైనల్ కు చేరిన గంగూలీ సేన కప్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ కంగారుల ధాటికి చెల్లిచెదురైపోయారు.
అప్పుడు అన్ని రంగాల్లో ఆస్ట్రేలియా దుర్బేద్యంగా ఉండేది. ఇప్పుడు మన జట్టు పటిష్టంగా మారింది. అప్పటి నష్టానికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశం ఏర్పడింది. టీమిండియా ప్రస్తుతం జోరు మీదుంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో రోహిత్ సేన కప్ గెలుస్తుందనే ఆశాభావం అందరిలో కనిపిస్తోంది. కానీ కంగారులను అంత తేలిగ్గా అంచనా వేయలేం. వారు ఏ చిన్న అవకాశం దొరికినా వారు వదలరు. అలాంటి అవకాశం వారికి ఇవ్వకూడదు.
2003 ఫైనల్ లో ఆస్ట్రేలియా 359 భారీ స్కోరు సాధించింది. దీంతో భారత్ భయపడింది. 125 పరుగులకే ఆలౌటైంది. దీంతో కప్ ను కంగారుల వశం చేసింది. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం పెరిగింది. ఆటగాళ్లకు శవయాత్ర చేసే వరకు వెళ్లింది. అప్పుడు గిల్ క్రిస్ట్, హేడెన్, పాంటింగ్, మార్టిన్, బెవాన్, సైమండ్స్ వంటి వారు ఉండటంతో జట్టు బలంగా ఉంది.
ఆస్ర్టేలియా జట్టుకు ఆపద సమయంలో కూడా ధైర్యంతో ఆడటం అలవాటు. అందుకే ఆ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని చెబుతున్నారు. ఏ చిన్న తప్పిదం జరిగినా దాన్ని వాడుకుని వారు చెలరేగిపోతుంటారు. మనకు 2003కు బదులు తీర్చుకునే అవకాశం చిక్కింది. దీన్ని ఉపయోగించుకుని కప్ గెలవాలని సగటు భారతీయుని ఆకాంక్ష.