Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రీసెంట్ గానే తన భర్త సోహెబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంది అనే వార్త సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. 2010 వ సంవత్సరం లో వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకున్నందుకు సానియా మీర్జా పై ఇండియన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెళ్లి తర్వాత కూడా ఆమె ఇండియా తరుపున టెన్నిస్ ఆడుతూ వచ్చింది.
గత ఏడాది తో ఆమె రిటైర్మెంట్ ని ప్రకటించి అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది. సోహెబ్ మాలిక్ ని పెళ్లాడిన తర్వాత వీళ్లిద్దరికీ ఇజాబ్ అనే కొడుకు ఉన్నాడు. చాలా కాలం నుండి సోహెబ్ మాలిక్ సనా జావేద్ అనే హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సానియా మీర్జా సోహెబ్ తో విభేదించి ఇండియా కి వచ్చేసింది.
అప్పటి నుండి తన కొడుకు తో కలిసి ఒంటరిగా జీవిస్తున్న సానియా మీర్జాని అభిమానులు బాధపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే భర్త నుండి విడిపోయిన తర్వాత ఏ అమ్మాయి అయినా భరణం అడగడం సర్వసాధారణం. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా భరణం డిమాండ్ చెయ్యడమే ఇన్ని రోజులు మనం చూసాము. కానీ సానియా మీర్జా నాకు ఒక్క పైసా కూడా భరణం అవసరం లేదని, విడాకుల కాగితం మీద సంతకం చేసింది.
ఇది తెలుసుకున్న తర్వాత అసలు ఇలాంటి అమ్మాయిలు ఇంకా మన సమాజం లో ఉన్నారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. సానియా మీర్జా టెన్నిస్ ద్వారా బాగానే సంపాదించింది. ఆమె నికర ఆస్తుల విలువ 210 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అందుకే తనకి తన బిడ్డకి ఒకరి డబ్బు మీద బ్రతకాల్సిన అవసరం లేదని కావాల్సినంత సంపాదించాను అని సానియా మీర్జా చెప్పిందట.
ఈ విషయాన్నీ ఆమె తండ్రి స్వయంగా తెలిపాడు. ఇదంతా పక్కన పెడితే సానియా మీర్జా మీద కూడా కొన్ని రూమర్స్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. ఆమె కొంతకాలం నుండి ఆమె ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే, సోహెబ్ మాలిక్ కూడా ఎఫైర్ పెట్టుకున్నాడని , అలా వీళ్లిద్దరి మధ్య చెడింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి , ఇది ఎంత వరకు నిజమో చూడాలి.