Dulquer : ‘లక్కీ’తో దుల్కర్ రెమ్యురేషన్ ఎంత పెరిగిందంటే?

Dulquer

Dulquer Salman

Dulquer Salman : విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇందులో లీడ్ రోల్ చేసిన దుల్కర్ సల్మాన్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ సినిమా కోసం ఆయన భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. రూ. 15 కోట్లు ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మలయాళ వెర్షన్ లాభాల్లో మేకర్స్ 50 శాతం వాటా కూడా ఇచ్చారు. మొత్తంగా ఆ డీల్ ద్వారా రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు సంపాదించాడు. మొత్తంగా లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ దాదాపు రూ. 19 కోట్లు సంపాదించాడు.

మరోవైపు కుబేర సినిమా కోసం నటుడు ధనుష్ కు రూ. 30 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా కోలీవుడ్, మాలీవుడ్ అంత భారీ పారితోషికం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ భారీ రెమ్యునరేషన్లు దక్కించుకునేందుకు ఇప్పుడు చాలా మంది నటులు డైరెక్ట్ తెలుగు సినిమాలను ఎంచుకుంటున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్ అత్యధిక పారితోషికం ఇస్తుండగా, ఇప్పుడు టాలీవుడ్ భారతదేశం అంతటా నటులకు అత్యంత డిమాండ్, అభిమాన పరిశ్రమగా మారింది. ఇక్కడి హీరోల రెమ్యురేషన్లు బాలీవుడ్ ను దాటిపోతున్నాయి. కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి మేకర్స్ నేరుగా షేర్ ఇస్తున్నారు. ఇది కూడా వారికి రెమ్యునరేషన్ కిందనే పడుతుంది. దీంతో కోట్లాది రూపాయలు తీసుకుంటున్నట్లు లెక్కలోకి వస్తుంది. ఇది బాలీవుడ్ నటుల రెమ్యునరేషన్ ను మించిపోతుంది. ఇతర భాషల స్టార్లయినా తెలుగులో సినిమా చేస్తే వారికి కూడా ఎక్కువగా రెమ్యురేషన్ అందుతుంది.

TAGS