JAISW News Telugu

97year Whiskey Old Bottle : 97 ఏళ్ల నాటి విస్కీ బాటిల్ కు వేలంలో ధర ఎంత పలికిందో తెలుసా?

97year Whiskey Old Bottle

97year Whiskey Old Bottle

97year Whiskey Old Bottle : పాత తరం నాటి వస్తువులకు భలే డిమాండ్ ఉంటుంది. వాటిని వేలం వేస్తే రూ. కోట్లు పలుకుతాయి. ఈనేపథ్యంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన విస్కీ బాటిల్ రూ.22 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. 97 ఏళ్ల నాటి క్రింతం తయారు చేసిన విస్కీ బాటిల్ కు ఇంత ధర పలకడం విశేషం. 2019లో కంపెనీ తయారు చేసిన విస్కీ రూ. 15కోట్లకు అమ్ముడుపోయింది.

విస్కీ బాటిల్ రూ. 12 కోట్లు పలుకుతుందని అనుకున్నారు. కానీ ఏకంగా రూ.22 కోట్లు పలకడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి నిలువ చేసింది. దాన్ని 1986లో 40 బాటిళ్లలో నింపింది. వీటిని అమ్మకానికి పెట్టలేదు. కొన్నింటిని మాత్రమే అమ్మింది. మిగతా బాటిళ్లను అలాగే ఉంచింది.

మందు అంటే ఎవరికిఇష్టం ఉండదు. సుమారు 90 శాతం మంది మందు తాగుతూనే ఉంటారు. ఓ పది శాతం మంది మాత్రమే మందు తాగడం లేదు. మందంటే అందరికి విందే. అందుకే రోజు మందు తాగుతూనే ఉంటారు. మందులో ఉన్న మజానే వేరు అని చెబుతుంటారు. ఇలా విస్కీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా మందు తాగడాన్ని ఓ ఫ్యాషన్ గా భావిస్తారు.

ఇలా నిలవ ఉంచిన మందుకు ఇంత భారీ మొత్తంలో ధర వస్తుందని అనుకోలేదు. కానీ రికార్డు స్థాయిలో రూ. 22 కోట్లు పలకడంతో అందరు షాకయ్యారు. మెకలాన్ కంపెనీ దాచిన బాటిల్ కే ఇంత ధర రావడం నిజంగా గొప్పవిషయమే. దీంతో కంపెనీ అవాక్కయింది. సుమారు వందేళ్లపాటు విస్కీని దాచి ఉంచడం విశేషంగానే భావించాలని మందుబాబులు చర్చించుకుంటున్నారు.

Exit mobile version