Train Accident in America : ఇండియానే కాదు అమెరికాను కూడా రైలు ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. చికాగోకు ప్రయాణికులతో వెళ్తున్న రైలు శుక్రవారం (నవంబర్ 17) రోజున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మందికిపైగా ప్రమాణికులు గాయపడ్డారు. ఇందులో కొంత మందికి తీవ్రమైన గాయాలయ్యాయి.
నేషనల్ ట్రాన్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం. చికాగో ట్రాన్సిట్ అథారిటీ రైలు హోవార్డ్-సీటీఏ స్టేషన్ సమీపంలో నార్త్ సైడ్ లో జరిగింది. ఉదయం 10.35 గంటలకు వేగంగా వచ్చిన రైలు మంచు తొలగించే పరికరాలపైకి దూసుకెళ్లింది.
‘ఏడుగురు CTA కార్మికులతో వెళ్తున్న యల్లో లైన్ రైల్ స్కోకీ నుంచి సౌత్ బౌండ్ లో ఉండగా నెమ్మదిగా కదులుతున్న రైలు పరికరాలను ఢీ కొట్టింది.’ అని చికాగో ఫైర్ డిపార్ట్ మెంట్ రెండో జిల్లా చీఫ్ రాబర్ట్ జురేవిచ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, 38 మంది పెద్దవారు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులైన 23 మందిని ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. వారు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని కోలుకుంటున్నారని అసిస్టెంట్ డిప్యూటీ చీఫ్ పారామెడిక్ కీత్ గ్రే వెల్లడించారు.
రైలు ఆపరేటర్ కు తీవ్రంగా గాయాలయ్యాయిన చికాగో సన్ టైమ్స్ నివేదించింది. అయితే, రైలులో ఉన్న 15 మంది క్షతగాత్రులు ఘటనా స్థలంలో చికిత్సకు నిరాకరించారని చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణకు బృందాన్ని పంపుతామిన నేషనల్ ట్రాన్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) పోస్ట్ చేసింది.