Weather Forecast : తెలంగాణలో ఈ రోజు (మార్చి 18) నుంచి మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వడగళ్ల వాన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. నేటి (సోమవారం) నుంచి శుక్రవారం (మార్చి 22) వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
రానున్న ఐదు రోజులు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో ఉక్కపోతు అనుభవిస్తున్న వారు వాతావరణం చల్లబడడంతో కొంత ఉపశమనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు పడుతున్నాయి. వాయవ్య తెలంగాణలో కూడా చిరు జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బీదర్ వరకు తేలికపాటి జల్లులు పడుతున్నాయి. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంది.
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి తెలంగాణలో మేఘాలు ఏర్పడుతాయి. ఉత్తర, వాయవ్య తెలంగాణలో జల్లులు పడతాయి. వర్షాలు రాత్రి 8 గంటల వరకూ కురుస్తాయి. ఇవాళ రాత్రంతా మేఘామృతమై ఉంటుంది.
ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ లో వడగండ్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం (మార్చి 19) ఉదయం వరకు నిర్మల్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక, బుధవారం టు శుక్రవారం పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేడి గాలులు, వేసవితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు ఐఏఎండీ చల్లని కబురు చెప్పడంతో నగర ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త రిలాక్స్ అవుతున్నారు.