Eating Carrots in Winter : చలికాలంలో క్యారెట్స్ ఎక్కువగా తినాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలున్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. పోషకాలు మెండుగా ఉండటం వల్ల మనకు రక్షణగా నిలుస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా తినడం వల్ల మన ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది.
క్యారట్ లో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఎ,కె తో పాటు ఇతర పోషకాలు అందుతాయి. దీంతో మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో క్యారెట్ జ్యూస్ రూపంలో కానీ కూర రూపంలో కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు దక్కుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
క్యారెట్ తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కంటి శుక్లాలు మెరుగుగా ఉండాలంటే క్యారెట్ తినడం మంచి మార్గం. ఇందులో ఉండే బీటా కెరోటిన్ క్యారెట్ ను తిన్న తరువాత విటమన్ ఎ గా మారుస్తుంది. ఇది మన కళ్లకు సాయపడుతుంది. కంటి చూపు బాగుండేందుకు ఇది దోహద పడుతుందని తెలుసుకుని వాడుకోవడం ఉత్తమం.
ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో క్యారెట్ మేలు చేస్తుంది. శరీరంలోని అవయవాలు సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. క్యారెట్ తీసుకుంటే అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.