Ram Charan-Sukumar : రామ్ చరణ్ కోసం సుకుమార్ కథ.. ఎలా ఉండబోతోందంటే?
Ram Charan-Sukumar : ప్రేమ కథలు, హిస్టారికల్, గ్యాంగ్ స్టర్, గనుల మాఫియా, చెట్ల స్మగ్లర్లు, క్రీడా కారులు ఇలాంటి కథలు ఇప్పుడున్న జనరేషన్ కు బోర్ కొట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఒక కథ రాస్తున్నారట. అయితే అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ను మరింత క్యూరియాసిటీని కలిగిస్తుంది.
రామ్ చరణ్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చేశాడు. ఆయన కెరీర్ లో చెప్పుకోతగ్గ బెస్ట్ సినిమాగా ఇది నిలిచింది. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అందువల్ల ఈ సారి ఆయన ఎంపిక చేసుకునే పాయింట్ యూనిక్ గా ఉండబోతోందని తెలుస్తోంది. చర్రీ ఇప్పటి వరకు చెయ్యని మాఫియా, స్మగ్లర్లు, రౌడీల కథలు, దీంతో పాటు కేజీఎఫ్ లాగా గనులు, పుష్ప లాగా చెట్ల స్మగ్లింగ్ లాంటివి కూడా చేయలేదు. కాబట్టి ఇందులో ఏదైనా ట్రై చేద్దామా అనుకుంటున్నారా? చర్రీ కోసం సుక్కు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారన్నది తెలియడం లేదు.
పక్కా లవ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీ లాంటి కథలు చరణ్ కు అంత మైలేజీని ఇవ్వవని తెలుస్తోంది. అలాంటప్పుడు సుక్కు ఎలాంటి కథ రాస్తాడు? అది కూడా మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రిపీటెడ్ గా రప్పించే కథ, యాక్షన్ మూవీ అయి ఉండాలి.
రామ్ చరణ్ ప్రస్తుతం #RC 16లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందని హోలీ సందర్భంగా రామ్ చరణ్ ప్రకటించాడు. హోలీ రోజున రంగులు పూసుకుంటూ సుకుమార్ – రామ్ చరణ్ కలుసుకున్న ఫొటోను కూడా షేర్ చేయడంతో ఆసక్తిని తలెత్తింది.
#RC17 కోసం సుకుమార్ – దేవీ
రామ్ చరణ్ తన ఇన్ స్టాలో ‘#RC17: ది ఫోర్స్ రీయునైట్స్’ అని రాసుకున్నాడు. ఒక స్లైడ్ లో సుకుమార్ తో ఫొటో, మరో స్లైడ్లో సినిమా ప్రీలుక్ పోస్టర్ షేర్ చేశారు. చెర్రీ, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ముగ్గురూ ‘రంగస్థలం’ను ఇచ్చారు. తదుపరి వెంచర్ #RC17ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాస్ట్ ను ఇంకా ప్రకటించలేదు. చర్రీ 17వ సినిమాను 2025 చివరి త్రైమాసికం నాటికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ #RC16కి సుకుమార్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ ప్రధానంగా సహకరిస్తున్నారు. ఇది వృద్ధి సినిమాస్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించే వెంచర్. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది.