Viral Video : కొత్త న్యాయ చట్టాలను ఎంత ఈజీగా వివరించాడో ఈ పోలీస్ ఆఫీసర్!
Viral Video : దేశంలో జూలై 1, 2024 నుంచి మూడు కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దశాబ్దాలుగా బ్రిటిష్ వారి చట్టాలనే దేశంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా వరకు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం మన దేశ పరిస్థితులకు, నేరాలకు తగ్గట్టుగా మార్చారు. ఈ కొత్త చట్టాలపై మంగళూరు సిటీ పోలీసులు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళూరు కమిషనర్ చిన్న వీడియో ద్వారా కొత్త చట్టాలపై చక్కగా అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
160 ఏండ్ల కింద ఇండియన్ పీనల్ కోడ్ స్టార్ట్ అయ్యిందని, దాని స్థానంలో జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత చట్టం అమల్లోకి వస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రజలకు జరిగే మేలు ఎంతో ఉందన్నారు. గత చట్టాల కంటే కొత్త చట్టం సులభంగా అర్థమయ్యేవిధంగా ఉందన్నారు. పాత ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే, కొత్త చట్టంలో 358 ఉన్నాయి.
మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే..ఇందులో శిక్షలు వినూత్నంగా ఉండబోతున్నాయి. నిందితులు చేసే చిన్న చిన్న తప్పులకు జైలు శిక్ష విధించకుండా కమ్యూనిటీ సర్వీస్ అనే శిక్షలు అమలు చేయనున్నారు. దీని ద్వారా వారి సామాజిక పరివర్తన వస్తుందంటున్నారు. మొక్కలు నాటించడం, చెట్లకు నీళ్లు పట్టించడం, సామాజిక విధులు వంటివి చేయించనున్నారు. ఇవి పాత చట్టంలో లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా ఇవి మనకు కనపడుతుంటాయి.
అలాగే ఈ చట్టం ప్రత్యేకత నేటి కాలనుగుణ నేరాలకు అనుగుణంగా ఉండడం. నేటి ఆధునాతన కాలమంతా టెక్నాలజీతో నడుస్తోంది. సైబర్ క్రైంలు పెరిగిపోయాయి. వీటి తగ్గట్టుగా కొత్త చట్టం ఉండబోతోంది. గతంలో వాట్సాప్, ఆడియా రికార్డింగ్, వీడియో కాల్స్, డిజిటల్ ఆధారాలు..వీటిని కూడా ఇప్పుడు సాక్ష్యాలుగా తీసుకోబోతున్నారు. ఈ చట్టం ద్వారా నేరస్తుడు తప్పించుకునే అవకాశం లేదని, శిక్ష విధించడం అనేది కాకుండా అతడిలో మార్పు తీసుకురావడం ప్రధాన ఉద్దేశమన్నారు. అలాగే ఈ కొత్త చట్టం ద్వారా బాధితుడికి న్యాయం జరుగుతుందన్నారు. జూలై 1న ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నందున ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము చేసిన చిన్న ప్రయత్నం ఇది అని మంగళూరు కమిషనర్ చెప్పుకొచ్చారు.