Poor CM Jagan : ‘పేద సీఎం’కు సూట్ ఎలా వచ్చిందబ్బా..రెంట్ కు తీసుకున్నాడా ఏంటీ?
Poor CM Jagan : ఏపీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. అరాచక వైసీపీ పాలనను తుదముట్టించేందుకు ఏకమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. వార్ వన్ సైడ్ అయిపోయినట్టుగా ప్రజల్లో ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఓటమి తప్పదనే టాక్ నడుస్తుండడంతో వైసీపీ అభ్యర్థులు పలుచోట్ల హింసను సృష్టించారు. ఓడిపోయే వేళ తమకే సాధ్యమైన దాడుల సంస్కతిని, ఫ్యాక్షన్ నేపథ్యాన్ని మరోసారి వైసీపీ నిలబెట్టుకుంది.
ఇదే తడవుగా ఓటమి రాబోతుందనే తెలిసి పెత్తందారులపై పోరు చేస్తున్న పేద సీఎంగా తనను తాను అభివర్ణించుకున్న సీఎం జగన్ ఫారిన్ ట్రిప్ వేశారు. పేద సీఎంగా చెప్పుకున్న ఆయన కోట్లు పెట్టి మరీ విదేశీ విహార యాత్రలకు వెళ్లారు. తనకు ఫోన్ లేదని, ఫోన్ నంబర్ సైతం లేదని ఇటీవలే చెప్పారు. ఇదిలా ఉండగా పేద సీఎం లండన్ పర్యటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. పెత్తందారులంతా భూమిపైనే ఉన్నారని, పేదవాడు మాత్రం విమానాల్లో విహరిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
వైఎస్ జగన్ టూర్ ఖర్చుపై నెటిజన్లు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి ఇది కుటుంబ పర్యటన కావడంతో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖాతాల్లోంచి ఖర్చు చేయవద్దు. కానీ సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దాదాపు రెండు వారాల పాటు ఆయనకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది. విస్టా జెట్ కంపెనీకి బొంబార్డియర్ 7500 అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలు. అంటే గంటకు 12లక్షలు ఖర్చు పెట్టే వ్యక్తి పేదవాడా? పెత్తందారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ కు రక్షణగా నలుగురు అధికారులు లండన్ కు వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరాత్ర ఖర్చులు కలిపి కోటిన్నర దాక ఖర్చవుతుంది. ఈ ఖర్చు అంతా ప్రభుత్వానిదే. ఇక ఈ టూర్ రెండు వారాల్లో ఎంత ఖర్చవుతుందో ఆ దేవుడి తెలియాలి అంటూ విమర్శిస్తున్నారు.
ఇక జగన్ ఓ రిచ్ గెటప్ లో దర్శనమివ్వగా..సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘‘చాలా చాలా పేదవాడు..రెడ్లు కూడా ఓటేయకపోతే గెటప్ రెంట్ కు మాట్లాడుకుని పేదవాడు ఇలా..దర్శనమిచ్చాడు.. ఇలాంటి గెటప్స్ లో..కనిపిస్తాడు..భారతదేశానికి ఇక రాలేని పేదవాడు’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏపీలో జగన్ పార్టీ దుకాణం మూసుకుంటుందని, జగన్ ఇక విదేశాల్లో స్థిరపడాల్సిందేనని కొందరు కామెంట్ చేస్తున్నారు.