Rajamouli : రాజమౌళికి గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ పై పట్టు ఎలా వచ్చిందంటే? 

Rajamouli

Rajamouli

Rajamouli : పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ఆర్ లాంటి మూవీలతో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి అక్కడి నుంచి ఆస్కార్ లెవల్ కు  తీసుకెళ్లగలిగాడు. ఒక సాధారణ దర్శకుడు పాన్ ఇండియా లెవల్లో ఆలోచించడానికి గల కారణాలేంటి. వండర్స్ క్రియేట్ చేయడం వెనక ఆయన నేర్చుకునే కొత్త విషయాలే కారణమని తెలుస్తోంది.

గ్రాఫిక్స్ డిజైనింగ్ మీద ఎలాంటి పట్టు లేకున్నా.. మగధీర, ఈగ, బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి మూవీల్లో విజువల్ వండర్స్ చూపించారు. ఇది ఆయనకు ఎలా సాధ్యమైంది. విజువల్ వండర్స్ పై ఆయనకు పట్టు ఎలా వచ్చిందని చాలా మంది ఆలోచనలో పడ్డారు. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ దాన్ని నిరూపించుకోవడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. రాజమౌళి అలా కాదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకుంటాడు. తనకున్న అపరిమితమైన తెలివితో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు.

 సినిమాల్లో గ్రాఫిక్స్ విషయాల్లో కూడా తన ఊహ కు నుంచి వచ్చిన వాటిని అక్కడ పనిచేసే టెక్నిషియన్స్ కు చెప్పి తనకు నచ్చిన విధంగా ఉండేలా చూసుకున్నాడు.  ఒక సినిమా తీసే దర్శకుడి ఆలోచనల నుంచి పుట్టిన క్రియేటివ్ థింగ్స్ సినిమాకు ప్రాణం పోస్తాయి. పది మందిని థియేటర్స్ కు రప్పిస్తాయి. కోట్ల రూపాయల కలెక్షన్స్ కుమ్మరిస్తాయి. రాజమౌళి ఎక్కువగా సీజ్ వర్క్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. గ్రాఫిక్స్ చేసినా అది ఏర్పడకుండా చూసుకుంటాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ తో ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు, రాజమౌళి ఇద్దరు చాలా కష్టపడుతున్నారు.

రాజమౌళితో పోటీ పడేందుకు ఎంతో మంది డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనలా చేయలేకపోతున్నారు. మహా భారతం కాన్సెప్ట్ తో ఒక సినిమా తీయనున్నడని టాక్ వినిపిస్తోంది. అయితే ముందుగా మహేశ్ బాబుతో చేసే సినిమా సక్సెస్ కాగానే మహాభారతం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

TAGS