Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మాణం పూర్తి కాకుండానే అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు కాంట్రాక్టర్ కు సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు నాణ్యత విషయంలో లోపాలు తలెత్తాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా బ్యారేజీల ప్రారంభం జరిగిన కొంత కాలానికే సీపేజీ సమస్య తలెత్తినా పట్టించుకోలేదు. దీంతో ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఎం సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చింది.
మేడిగడ్డ వైఫల్యాలను ఎత్తి చూపారు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తాయి. సీపీ బ్లాకులు పక్కకు జరిగాయి. 2019 నవంబర్ లోనే ఈ సమస్య తలెత్తినా పట్టించుకోలేదు. ఫలితంగా సమస్య తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యంతోనే బ్యారేజీ నిర్మాణంలో సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. కాంట్రాక్టర్ కు గడువు పెంచినా నాణ్యత లోపం తలెత్తినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కు గత నెలలో లేఖ రాసినా పని పూర్తి కాలేదు. ఒప్పందం ప్రకారం పని కాకపోవడంతో పని పూర్తయినట్లు సర్టిఫికెట్ మాత్రం పొరపాటున ఇచ్చారు. దీంతోనే సమస్య ఏర్పడింది. పొరపాటున ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు గుర్తించారు. సర్టిఫికెట్ ను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇవ్వగా ఎస్ ఈ కౌంటర్ సంతకం చేశారు. సీఈ లేఖపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలా మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నిబంధనలు పాటించకపోవడంతో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ప్రాజెక్టు నాణ్యత దెబ్బతింది. దీంతో నిధులన్ని బూడిదలో పోసిన పన్నీరు సంద్రంగా అయిపో యాయి. ఈనేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాజెక్టులన్నాక పాడు కావా? అని ఎదురు దాడికి దిగుతున్నారు. ఏదో కొంత పాడైతే మరమ్మతు చేయించుకోవాల్సింది పోయి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.