Seat Belt : సీట్ బెల్ట్ లాకైతే ఎలా బయట పడవచ్చు..
Seat Belt :సీటు బెల్ట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలను తప్పించుకోవచ్చు అని మనకు తెలిసిందే కదా.. కానీ అదే సీటు బెల్ట్ ఫైర్ యాక్సిడెంట్లో ప్రయాణికుల ప్రాణం తీస్తుందని ఎంత మందికి తెలుసు. సాధారణంగా ఒక వాహనం మరో వాహనం, లేదంటే వాహనం దేనికైనా గుద్దుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే సీటుకే పరిమితమై ముందుకు వెళ్లడం జరగదు. ఫలితంగా ప్రాణాలు కాపాడుకోవచ్చు. పైగా సీటు బెల్ట్ ఉంటేనే ఎయిర్ బెలూన్ రిలీజై కూడా బతకవచ్చు. కానీ అదే సీటు బెల్ట్ పైర్ యాక్సిడెంట్ లో ప్రాణం తీస్తుందని చాలా మందికి తెలియదు.
ఇటీవల ఒక కారులో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో సీటు బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ అది లాకై అగ్నికి ఆహుతయ్యాడు. అలా లాక్ అయిన సీట్ బెల్ట్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.
ఫైర్ యాక్సిడెంట్ లాంటివి అయితే వెంటనే సీటు కింది భాగంలో ఉన్న లివర్ ను లాగి సాధ్యమైనంత వెనక్కు సీటును నెట్టాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్న సీటు డౌన్ లివర్ లాగి వెనక్కు వాలి మెల్లిగా సీటు బెల్ట్ ను తప్పించి దిగవచ్చు. ఇలా చేస్తే ప్రాణాలు కాపాడు కోవచ్చు.
ఈ వీడియోలో మొత్తం అర్థం అవుతుంది.