Jasprit Bumrah : ఎలా ఆడాలి బూమ్రా? బ్యాట్ కింద పడేసి మరీ విస్తుపోయిన బెన్‌స్టోక్స్
India Vs England : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా దుమ్ము లేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో అతను కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు కుదేలై ఫస్ట్ ఇన్నింగ్స్ లో 253 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాప్ పేసర్ అద్భుతమైన డెలివరీతో హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ను 47 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు.
బుమ్రా వేసిన 50వ ఓవర్‌లో ఫస్ట్ బాల్ కే స్టోక్స్ ఎదుర్కొన్నా పరుగులేమీ రాలేదు. సెకండ్ బాల్ వేసేప్పుడు బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కట్టర్ సంధించి బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్ దిశగా మినిమమ్ హైట్ లో వచ్చిన బాల్ ను స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. కానీ, బాల్ మిసై ఆఫ్ స్టంప్‌ని పడగొట్టింది. దీంతో స్టోక్స్ అసలేమైందని వెనుకకు తిరిగి చూసుకోకుండా బ్యాట్ కింద పడేసి ‘ఎలా ఆడాలి ఈ బంతిని..?’ అన్నట్టుగా నిరాశ వ్యక్తం చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ వికెట్‌కు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టోక్స్ ఔట్ తో బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
మ్యాచ్ గురించి తెలుసుకుంటే.. ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ ఇండియా.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13*), యశస్వి జైస్వాల్ (15*)తో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 171 రన్స్ గా ఉంది.
“How can I play that?” – probably what Ben Stokes is thinking.
Bumrah bowls the England captian for this 150th wicket. #INDvENG #Bumrah #BoomBOOM #OlliePope #BenStokes #RohitSharma #DeathRattle pic.twitter.com/1hQuacbqY3
— duckcricket (@duckcrickpal) February 3, 2024