Megastar Chiranjeevi : జన్మనిచ్చిన తండ్రి రుణం ఎలా తీర్చుకోగలం. కన్న తండ్రికి ఎంత సేవ చేసిన తక్కువే. పెంచి, పెద్దజేసిన తండ్రికి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడో , లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా కనబడడు. కానీ జన్మనిచ్చిన తల్లి,దండ్రులే దేవుళ్ళు. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు పెద్దలు. అందుకే దేవునికి పూజలు చూస్తున్నట్టుగానే తండ్రికి కూడా పూజ రూపంలో సేవలు చేయాలి. అల్లారు ముద్దుగా పెంచారు తప్పటడుగులు వేస్తున్నప్పటి నుంచే జీవితంలో కూడా తప్పటడుగులు వేయరాదంటూ క్రమశిక్షణతో పెంచాడు మా నాన్న కొణిదెల వెంకటరావు. అయన నేర్పిన జీవిత పాఠాలే నన్ను ఈ రోజు జోవితంలో ఇంతవాన్ని చేశాయంటూ ప్రముఖ తెలుగు సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి ఫాథర్స్ డే సందర్బంగ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కొణిదెల వెంకటరావు సంతానం ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ముగ్గురు కొడుకులు కూడా అందనంత ఎత్తుకు ఎదిగారు. చిరంజీవి సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. తిరుగులేని నటుడిగా సినీ పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అవార్డులకు కొదవలేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రి పదవులను పొందారు. నేటికీ కూడా సినీపరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయనతో పాటు ఆయన వారసులను కూడా సినీ పరిశ్రమకు తీసుకువచ్చారు.
సినీ పరిశ్రమ కు చిరంజీవి తన వారసుడిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పరిచయం చేశారు. ఆయన కూడా పరిశ్రమలో నిలదొక్కుకొని తిరుగులేని కథానాయకుడయ్యారు. జనసేన పార్టీ స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగులేని నాయకుడయ్యారు. తాజాగా ఏపీలో నిర్మాణమైన కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయన పార్టీ ప్రాంతీయ పార్టీ కావచ్చు. కానీ జాతీయ స్థాయిలో ఎదిగారు. ప్రధాన మంత్రి పవన్ అంటూ పేరు పెట్టి పిలిచేంత స్థాయికి ఎదిగారు.
మాకు జన్మనిచ్చిన తండ్రికి కొడుకులుగా ఏమి ఇచ్చిన ఋణం తీర్చుకోలేము. కానీ అయన పెంచిన విదానంతోనే మేము ఈనాడు సమాజంలో పేరు సంపాదించుకోడానికి ప్రధాన కారణం కూడా మా తండ్రే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టడం విశేషం.