Tollywood Heroine : సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు పెద్ద స్థాయికి వెళ్ళాలి అనుకుంటే వచ్చిన ప్రతీ అవకాశం ని సద్వినియోగపరుచుకోవాలి. అలా జరగాలంటే డైరెక్టర్స్ ఏది చెప్తే అది చెయ్యాలి, ఎదురు చెప్పకూడదు. కొంతమందికి సినిమాలే లోకం గా బ్రతుకుతారు కాబట్టి వాళ్ళు పూర్తిగా డైరెక్టర్ కి సరెండర్ అయిపోతారు. ఏది చెప్తే చెప్తే చేస్తారు, తిట్టినా కొట్టినా భరిస్తారు. మగవాళ్ళు ఎలాంటివైనా తట్టుకొని నిలబడగలరు కానీ, ఆడవాళ్లు ఇండస్ట్రీ లో కొనసాగడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లో ఎదో సాధిద్దాం అని వచ్చే అమ్మాయిలకు అడుగడుగునా అగ్ని పరీక్షలే. కొంతమంది అమ్మాయిలు ఇండస్ట్రీ లో పైకి ఎదగాలి అనే కసితో డైరెక్టర్ పడక గదిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా వెళ్తారు. అలా వెళ్లి స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వాలనే కోరిక మనసులో బలంగా ఉన్నప్పటికీ, తాము నమ్ముకున్న సిద్ధాంతాలను తుడిచిపారేయలేక ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అలా ఒక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేక ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయిందట. పూర్తి వివరణలోకి వెళ్తే అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుంది ఆ హాట్ బ్యూటీ. కానీ ఆమె చాలా సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. సినిమాల్లో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తుంది తప్ప, అందాల ఆరబోతకు, అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు ఆ అమ్మాయి పూర్తిగా దూరం. కానీ ఒక సినిమాలో ఆమె నటిస్తున్నప్పుడు డైరెక్టర్ సన్నివేశానికి తగ్గట్టుగా ఒక రొమాంటిక్ సీన్ ని తీసే అవసరం ఉందట.
డైరెక్టర్ వెళ్లి హీరోయిన్ కి ఈ విషయం గురించి చెప్పగా, ఆమె ముందుగానే అగ్రిమెంట్ లో అలాంటి సన్నివేశాలకు నో చెప్పాను కదా, మళ్ళీ ఏమిటిది అని అడగగా, దానికి ఆ స్టార్ డైరెక్టర్ కథ కి చాలా కీలకం అందుకే పెట్టాను అని అన్నాడట. ఇక చేసేది ఏమి లేక హీరోయిన్ కూడా బలవంతంగా ఒప్పుకొని ఆ సన్నివేశం చెయ్యడానికి సిద్ధమైంది. కానీ ఆమె వల్ల కావడం లేదు. ఎన్నో టేకులు కూడా తీసుకుంది. చివరికి ఇదంతా నా వల్ల కాదు అని ఆ సినిమా నుండి తప్పుకోవడమే కాకుండా, టాలీవుడ్ కి కూడా టాటా చెప్పేసిందట.