Trainee Pilot : ఆశలు ఆవిరి.. రోడ్డు ప్రమాదంలో ట్రైనీ పైలెట్ మృతి

Trainee Pilot died
Trainee pilot Died : హైదరాబాద్ శివారులోని కీసర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో నేరెడ్ మెట్ కు చెందిన గంగుమళ్ల శ్రీకరణ్ రెడ్డి (25) అనే ట్రైనీ పైలట్ మృతి చెందాడు. పూజల నిమిత్తం శ్రీకరణ్ యాదాద్రి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున యాదాద్రికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్ప బయలుదేరాడు. నేరెడ్ మెట్ నుంచి ఈసీఐఎల్, కుషాయిగూడ మీదుగా కారులో వచ్చి కీసర వద్ద అవుటర్ రింగు రోడ్డు ఎక్కాడు. రింగు రోడ్డుపై ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శ్రీకరణ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను ఘట్కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.