Indian spices : భారత మసాలాలపై హాంకాంగ్, సింగపూర్ నిషేధం
Indian spices : భారత్ కు చెందిన మసాల దినుసుల తయారీ సంస్థలు ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీలకు చెందిన మసాల దినుసుల్ని నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. గత వారం సింగపూర్ ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్ తో పాటు ఎండిహెచ్ సాంబార్ మసాలాను హాంకాంగ్ నిషేధించింది. హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ విభాగం ఏప్రిల్ 5న నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఎండీహెచ్ గ్రూప్ తయారు చేసిన మసాల దినుసులైన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాల. కర్రీ పౌడర్ లలో ఇథిలీన్ ఆక్సైడ్ గుర్తించినట్లు ప్రకటించింది.
దీంతో ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలతో పాటు అన్ని కంపెనీల మసాలా ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించాలని ఫుడ్ కమిషనర్లను కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. 20 రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.