Honey trap : 48 మంది మంత్రులు, నేతలపై ‘హనీ ట్రాప్’

Honey trap
Honey trap : కర్ణాటకలో మంత్రులు సహా 48 మంది రాజకీయ నాయకులు ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారంటూ ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వేసిన వలలో జాతీయ స్థాయి నేతలు కూడా చిక్కుకున్నారని మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని అధికార, విపక్ష నేతలు డిమాండ్ చేయడంతో, ప్రభుత్వం దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.