Michigan : లైంగిక వేధింపుల కేసులో ఇంటి యజమానికి 185 వేల డాలర్ల జరిమానా
Michigan : భారత సంతతికి చెందిన మిచిగాన్ భూస్వామి మహ్మద్ హుస్సేన్ ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ (ఎఫ్.హెచ్.ఏ) దావాపై న్యాయ శాఖకు 1,85,000 డాలర్ల నష్టపరిహారం, సివిల్ పెనాల్టీ చెల్లించేందుకు అంగీకరించారు.
మిచిగాన్ లోని డియర్ బోర్న్ హైట్స్ లో మహ్మద్ హుస్సేన్ కు ఇల్లు ఉంది. ఈ ఇంట్లో మహిళలు రెంట్ కు ఉంటున్నారు. వారిపై మహ్మద్ హుస్సేన్ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అద్దెకు ఉంటున్న వారిపై ఇలాంటి వేధింపులు సరికాదని న్యాయమూర్తి నొక్కి చెప్పారు. హుస్సేన్ అవాంఛనీయమైన పనులకు పాల్పడ్డాడని, లైంగిక కోరికలు తీరిస్తే గృహ ప్రయోజనాలు (రెంటు తగ్గించడం, తీసుకోకపోవడం, బిల్లు విషయంలో) కల్పిస్తానని ఆఫర్ చేశాడని సదరు మహిళలు దావాలో వివరణాత్మక ఆరోపణలు చేశారు.
2017లో కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహ్మద్ హుస్సేన్ ఫెయిర్ పై మరిన్ని కేసులు నమోదు చేశారు. అవి మొత్తం 39 కేసులు అయ్యాయి. 12 మిలియన్ డాలర్లకు పైగా రికవరీ చేసిన ఇలాంటి దుష్ప్రవర్తనను ఎదుర్కోవడం, అవగాహన పెంచడం న్యాయ శాఖ లైంగిక వేధింపుల ఇన్ హౌసింగ్ ఇనిషియేటివ్ లక్ష్యం.
పౌరహక్కుల విభాగం, యూఎస్ అటార్నీలా కార్యాలయాలు అమలు చేసే ఎఫ్‌హెచ్‌ఏ, లింగభేదం సహా వివిధ అంశాల ఆధారంగా గృహ వివక్షను నిషేధిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రెంట్ కు ఉన్నంత మాత్రాన లైంకిగదాడికి పాల్పడతాం అనడం యజమాని తగదని, ఇలాంటి చర్యలకు గట్టి శిక్షలు ఉంటాయిని న్యాయమూర్తి హెచ్చరించారు.