Ayodhya Rama : రాముడి ప్రతిష్ట సందర్భంగా ఇళ్లల్లో ఏం చేయాలో తెలుసా?

Ayodhya Rama, minister dharmendra pradhan Home
Ayodhya Rama : కొన్ని గంటల్లో రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అయోధ్య జనంతో నిండిపోయింది. రాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రామభక్తులు చేరుకున్నారు. ఎటు చూసినా జనమే. ఎక్కడ చూసినా ప్రజలే. దీంతో అయోధ్య కిక్కిరిసిపోయింది. జనంతో నిండిపోయింది. అంతా రామనామస్మరణతో మారిమోగుతోంది. రామభక్తితో నిండిపోయింది. సర్వం రామ జపమే. జై శ్రీరామ్ అంటూ భక్తజనం రామమంత్రం స్మరిస్తున్నారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తెల్లవారు జామునే నిద్ర లేవాలి. తలస్నానం చేయాలి. దేవుడికి దీపం వెలిగించాలి. సీతారామ లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత ఆంజనేయుడడికి షోడషోపచార పూజలు చేయాలి. భక్తి శ్రద్ధలతో రామ నామమే జపించాలి. పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా రోజంతా రామ జపమే చేస్తుంటే పుణ్యం దక్కుతుంది.
అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన చేస్తుండాలి. ఐదు దీపాలను వెలిగించాలి. రాముడిని మనసులో నిలుపుకుని పూజలు చేయడం మంచిది. ఇలా రాముడికి మనం చేసే పూజలతో మనకు మేలు కలుగుతుంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని ఇవాళ దైవ నామస్మరణతో గడిపిన వారికి పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికే అందరు అయోధ్య చేరుకున్నారు. వేడుకలను స్వయంగా వీక్షించేందుకు వెళ్లారు. రాముడి ప్రాణప్రతిష్ట అపూర్వ ఘట్టాన్ని కనులారా చూడాలని కోట్లాది మంది అయోధ్య చేరారు. దేవుడి ప్రాణప్రతిష్ట మనసారా చూసి తరించాలని వేడుకుంటున్నారు. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే మంచిదనే ఉద్దేశంతో చాలా మంది అయోధ్యకు పరుగులు పెడుతున్నారు.