Home Minister Anitha : జగన్ కు పూటకో మాట అలవాటే: హోంమంత్రి అనిత
Home Minister Anitha : పూటకో మాట మాట్లాడటం వైఎస్ జగన్ కు అలవాటేనని, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమలకు వెళ్లలేదని, దేశం గురించి మాట్లాడిన జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ నేత జగన్ పై మండిపడ్డారు. పూటకో మాట జగన్ కు అలవాటేనని, ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకొని నోటీసులు ఇచ్చారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ తిరుమలకు రాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి హౌజ్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయలేదని, కనీసం పోలీసు పహారా కూడా వేయలేదని, ఆయన సెక్యూరిటీ నిమిత్తం ఉండే పోలీస్ అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారని తెలిపారు.
బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, జగన్ మీద కొందరు ధార్మిక సంఘాలు కోపంతో ఉన్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా నోటీసులు ఇస్తే, తిరుమలకు రానివ్వకుండా నోటీసులు నోటీసులు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబును ఎయిర్ పోర్టుల్లో ఆపినట్లు జగన్ ను ఎన్నడూ ఆపలేదని, అలా చేసి సెంట్రల్ జైల్ విజిట్ లు చేసేవారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తున్నప్పుడు మా మీద బురద జల్లడానికి పోలీసులు నోటీసులు ఇచ్చారని చెబుతున్నాడు కానీ ఫస్ట్ అతనిి తిరుమలకు వెళ్లడం ఇష్టం లేదని, అతడు డిక్లరేషన్ ఇస్తే కుటుంబ సభ్యులకు పట్టిన గతే తనకు పడుతుందని ఊహించి తిరుమలకు వెళ్లట్లేదని ఆరోపించారు.