Home Minister Anita : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత

Home Minister Anita
Home Minister Anita : ఏపీలో శాంతిభద్రతల అంశంపై పొలిటికల్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రిగా తాను విఫలమయ్యానని పవన్ కల్యాణ్ అనలేదని చెప్పారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. నేరస్తులు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారని చెప్పారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మిమ్మల్ని విమర్శించే నాయకులందరికీ నేను ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి.’ అని పవన్ పేర్కొన్నారు.