Holi Tragedy : హోలీ విషాదం.. తెలంగాణలో ఆరుగురి మృతి..

Holi Tragedy

Holi Tragedy

Holi Tragedy : ప్రతీ ఏటా హోలీ తర్వాతి రోజు ఏదో ఒక క్రైం వార్త వింటూనే ఉంటాం. ఈ ఏటా అందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీ సంవత్సరం అధికారులు, ప్రజా ప్రతినిధులు సూచనలు చేస్తున్నా.. హెచ్చరికలు పంపుతున్నా.. కొందరు వాటని పెడచెవిన పెడుతుంటారు. ఎక్కువగా నీటి ప్రమాదాల్లోనే మరణిస్తుంటారు.

తెలంగాణలో సోమవారం (హోలీ పండగ రోజు) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు యువకులు నీటమునిగి మృతి చెందారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వార్ధా నదిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. స్నేహితులతో కలిసి హోలీ ఆడిన అనంతరం యువకుడు స్నానానికి నది వద్దకు వెళ్లాడు.

కౌటాల మండలం తాటిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదే మండలంలోని నదీమాబాద్ గ్రామానికి చెందిన 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువకుడు మరణించాడు.

మృతులలో ఆలం సాయి (22), పీ కమలాకర్ (25), ఉప్పుల సంతోష్ (23), వై ప్రవీణ్ (24) ఉన్నట్లు గుర్తించారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీసి స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

వారంతా హోలీ ఆడుకున్న అనంతరం మద్యం తాగి ఈత కోసం జిలావాసంలోకి దిగి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మహేశ్వరం మండలం పెద్ద చెరువులో చోటు చేసుకుంది.

TAGS