Wife bath Early once’s : పరిశుభ్రత అంటే అందిరికీ ఇష్టమే. అయితే సాధారణంగా మహిళలు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పరిశుభ్రత విషయంలో కొందరు పురుషులు బద్దకిస్తూ ఉంటార. అయితే అందుకు విరుద్ధమైన ఉదంతం తైవాన్ లో వెలుగులోకి చూసిది.
తైవాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, భరించలేకపోతున్నానని, ఆమె కారణంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కోర్టుకెక్కాడు. తనకు విడాకులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు.
తన భార్యకు ఉన్న ఈ అలవాటుతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది మాత్రమే కాదు, ఆమె గతంలో వారంలో ఒక రోజు మాత్రమే తల స్నానం చేసేదని, పెళ్లయ్యాక పరిస్థితి మరింత దారుణంగా మారిందని భర్త వాపోయాడు.
ఇప్పుడు ఆమె ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, ఆమె స్నానం చేయడానికి 6 గంటలు పడుతుందని కోర్టుకు వివరించాడు. అలాగే తన ఉద్యోగం కూడా వదిలేసి ఆమె తన తల్లిదండ్రులతో ఉండాలంటూ పోరు పెడుతున్నదని ఆరోపణలు చేశాడు. అయితే గతంలో తాను ఏ ఉద్యోగం చేయలేదని, కానీ 2015 లో ఒక నెలపాటు ఆమెకు తెలియకుండా రహస్యంగా ఉద్యోగం చేశానని, ఆమెకు విషయం చెబితే ఉద్యోగం వదిలివేయమంటూ ఒత్తిడి చేసినట్లు వివరించారు. అందుకు తాను నిరాకరించాని, ఆమె వైఖరి కారణంగా విడాకులు కోరుతున్నట్లు చెప్పాడు. భర్త చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. భర్త తనను మంచిగానే చూసుకుంటున్నాడని కోర్టుకు వివరించింది.